లాక్‌డౌన్‌: ‘ఏం చేస్తున్నావ్‌ స్మిత్‌’ | CoronaLockdown: Steve Smith And Ish Sodhi In A Candid Video Chat | Sakshi
Sakshi News home page

లాక్‌డౌన్‌: ‘ఏం చేస్తున్నావ్‌ స్మిత్‌’

Published Tue, Apr 7 2020 12:22 PM | Last Updated on Tue, Apr 7 2020 12:26 PM

CoronaLockdown: Steve Smith And Ish Sodhi In A Candid Video Chat - Sakshi

హైదరాబాద్‌ : క్షణం తీరికలేకుండా ఉండే సెలబ్రిటీలు లాక్‌డౌన్‌ సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇంటిపట్టునే ఉంటూ కుటుంబసభ్యులతో సరదాగా గుడుపుతున్నారు. ఇక వరస సిరీస్‌లు, పర్యటనలతో బిజీగా ఉంటే ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌ స్మిత్‌ కూడా లాక్‌డౌన్‌ సమయాన్ని పూర్తిగా కుటుంబానికే కేటాయించినట్లు పేర్కొన్నాడు. రోజూ నెట్‌ఫ్లిక్స్‌ చూస్తూ చిల్‌ అవుతున్నట్లు పేర్కొన్నాడు. ఐపీఎల్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ సారథి అయిన స్మిత్‌ తన సహచర క్రికెటర్‌ ఇష్‌ సోదీతో లైవ్‌ చాట్‌లో పాల్గొన్నాడు. వీరిద్దరి సంభాషణలకు సంబంధించిన వీడియోలను రాజస్తాన్‌ రాయల్స్‌ తమ అధికారిక ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. 

లైవ్‌ చాట్‌లో స్మిత్‌పై ఇష్‌ పలు ప్రశ్నలు సంధించాడు. లాక్‌డౌన్‌ సమయంలో ఏం చేస్తున్నావ్‌ స్మిత్‌ అని అడగ్గా.. ‘క్రికెట్‌తో బిజీగా ఉండటంతో కుటుంబానికి మనం ఎక్కువ సమయాన్ని కేటాయించలేం. నా లాక్‌డౌన్‌ సమయం మొత్తాన్ని వారికే ఇచ్చేశా. కుటుంబంతో సరదాగా గడుపుతు ప్రస్తుతానికైతే చిల్‌ అవుతున్నాను. అదేవిధంగా నెట్‌ఫ్లిక్స్‌లో షోస్‌, సినిమాలు చూస్తున్నాను’ అని స్మిత్‌ పేర్కొన్నాడు. ఇక ఏంటి స్మిత్‌ నీ ముఖం అలా అయిందేంటని సరదాగా ఇష్‌ పేర్కొనగా.. ‘మరీ భయంకరంగా లేదు’అంటూ స్మిత్‌ కూడా అంతేసరదాగా బదులిచ్చాడు. అంతేకాకుండా స్మిత్‌ తన బ్యాటింగ్‌ టెక్నిక్స్‌ గురించి ఇష్‌కు స్మిత్‌ వివరించాడు.  ప్రస్తుతం వీరిద్దరి సంభాషణకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

చదవండి:
లాక్‌డౌన్‌: ‘ఖైదీననే భావన కలుగుతోంది’
శ్రేయస్‌ టీనేజ్‌లో జరిగింది ఇది!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement