అక్టోబరులో భజ్జీ పెళ్లి | Cricketer Harbhajan Singh to marry actor Geeta Basra in October | Sakshi
Sakshi News home page

అక్టోబరులో భజ్జీ పెళ్లి

Published Sun, Aug 23 2015 1:17 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

అక్టోబరులో భజ్జీ పెళ్లి - Sakshi

అక్టోబరులో భజ్జీ పెళ్లి

భారత క్రికెటర్ హర్భజన్ సింగ్ అక్టోబరులో ఓ ఇంటివాడు కానున్నాడు. బాలీవుడ్ నటి గీతా బాస్రాతో అతని వివాహం అక్టోబరు 29న జరుగుతుందని క్రికెటర్ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. జలంధర్‌కు 20 కిలోమీటర్ల దూరంలోని పగ్వారాలో ఉన్న ఓ హోటల్‌లో పంజాబీ సంప్రదాయంలో ఈ పెళ్లి జరగనుంది. ఒకవేళ దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో వన్డేలలో భజ్జీకి చోటు దక్కితే మాత్రం వివాహ తేదీలో మార్పు జరుగుతుంది. కేవలం టెస్టుల్లో ఉండేటట్లయితే సమస్య లేదు. చాలాకాలంగా హర్భజన్, గీతాబాస్రా ప్రేమలో ఉన్నారు. గత సీజన్‌లో ముంబై ఇండియన్స్ ఆడిన అనేక మ్యాచ్‌లకు ఆమె వచ్చింది. ఈ వివాహానికి పలువురు క్రికెటర్లతో పాటు బాలీవుడ్ నటులు హాజరవుతారని క్రికెటర్ సన్నిహితులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement