2018 వరకు ‘రియల్’తోనే... | Cristiano Ronaldo agrees new five year deal at Real Madrid | Sakshi
Sakshi News home page

2018 వరకు ‘రియల్’తోనే...

Published Mon, Sep 16 2013 1:17 AM | Last Updated on Tue, Oct 2 2018 8:39 PM

2018 వరకు ‘రియల్’తోనే... - Sakshi

2018 వరకు ‘రియల్’తోనే...

మాడ్రిడ్: ఫుట్‌బాల్ స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్)... రియల్ మాడ్రిడ్‌తో తన ఒప్పందాన్ని పునరుద్ధరించుకున్నాడు. నిబంధనల ప్రకారం 2015తో అతని కాంట్రాక్ట్ ముగియాల్సి ఉంది. కొత్త ఒప్పందం ప్రకారం రొనాల్డో 2018 వరకు క్లబ్‌తో కొనసాగనున్నాడు. అయితే దీనికి సంబంధించిన విషయాలను మాత్రం రియల్ మాడ్రిడ్ బయటకు వెల్లడించడం లేదు. శనివారం జరిగిన క్లబ్ వేడుకలకు రియల్ అధ్యక్షుడు ఫ్లొరెంటినో పెరెజ్‌తోపాటు రొనాల్డో కూడా హాజరయ్యాడు.
 
 ఆ సమయంలోనే కాంట్రాక్ట్ పునరుద్ధరణ జరిగిందని స్థానిక పత్రిక పేర్కొంది. ఈ ఒప్పందం ప్రకారం ప్రతీ సీజన్‌కు రొనాల్డోకు కోటీ 70 లక్షల యూరోల (రూ. 143 కోట్లు) చొప్పున  క్లబ్ చెల్లించనుంది. అంతకంటే ఎక్కువ ఆడాల్సి వస్తే మరో 10 లక్షల యూరోలను అదనంగా చెల్లించనుంది. దీంతో స్పానిష్ ఫుట్‌బాల్‌లో అత్యధిక డబ్బులు ఆర్జించే ఆటగాడిగా రొనాల్డో రికార్డులకు ఎక్కే అవకాశం ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement