
చెన్నై: ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ దీపక్ చాహర్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో చెపాక్ వేదికగా మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన చాహర్.. 20 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. అయితే ఇందులో 20 డాట్ బాల్స్ ఉండటంతో విశేషం. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకూ 20 డాట్‌బాల్స్ ఎవరూ వేయలేదు. గతంలో ఆశిష్ నెహ్రా, మునాఫ్ పటేల్, ఫీడెల్ ఎడ్వర్డ్స్‌లు ఐపీఎల్‌లో అత్యధికంగా డాట్ బాల్స్ వేశారు.
ఈ ముగ్గురూ 2009 ఐపీఎల్ సీజన్‌లో 19 డాట్ బాల్స్ వేశారు. అయితే మంగళవారం రాత్రి ఆ సంయుక్త రికార్డును దీపక్ చాహర్ బ్రేక్ చేశాడు. గత శనివారం కింగ్స్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో దీపక్ చాహర్ వరుసగా రెండు నోబాల్స్ విసరడంతో.. అతనిపై ధోని గుస్సా అయిన సంగతి తెలిసిందే. అయితే ధోని కోపం తర్వాత తప్పిదాల్ని దిద్దుకున్న చాహర్.. ఆ ఓవర్‌లో ఓ వికెట్ పడగొట్టి చెన్నైని గెలిపించాడు. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై ఏడు వికెట్ల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. కోల్‌కతా నైట్‌రైడర్స్ 9 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేయగా, చెన్నై మరో 16 బంతులు మిగిలి ఉండగానే చెన్నైవిజయాన్ని అందుకుంది.