
ముంబై : ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)తాజా సీజన్‌లో భాగంగా మంగళవారం ఇక్కడ వాంఖేడే స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్-చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య తొలి క్వాలిఫయర్ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది. టాస్ గెలిచిన సీఎస్‌కే కెప్టెన్ ఎంఎస్ ధోని..ముందుగా సన్‌రైజర్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. అంతకముందు లీగ్ దశలో ఇరు జట్ల మధ్య జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ సీఎస్‌కేనే విజయం సాధించింది. దాంతో ఈ మ్యాచ్‌లో గెలిచి ఘనంగా ప్రతీకారం తీర‍్చుకోవాలని సన్‌రైజర్స్ భావిస్తోంది. క్వాలిఫయర్-1లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ బెర్తును ఖాయం చేసుకుంటుంది. ఓడిన జట్టుకు తుది పోరుకు అర్హత సాధించేందుకు ఎలిమినేటర్ మ్యాచ్ రూపంలో మరో అవకాశం ఉంది.
రెండేళ్ల తర్వాత పునరాగమనం చేసిన చెన్నై జట్టు అన్ని రంగాల్లో ఆకట్టుకుంటూ 18 పాయింట్లతో ప్లేఆఫ్ రేసులో నిలిచింది. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ అదే 18 పాయింట్లు సాధించి మెరుగైన రన్‌రేట్ టాప్ ప్లేస్‌ను ఆక్రమించింది. చెన్నై జట్టు బ్యాటింగ్‌లో అంబటి రాయుడు, ఎంఎస్ ధోని, సురేశ్ రైనా, రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రేవోలు కీలకం కాగా, సన్‌రైజర్స్ జట్టు బ్యాటింగ్ విభాగంలో కేన్ విలియమ్సన్, శిఖర్ ధావన్, మనీష్ పాండే, శ్రీవాత్స్ గోస్వామి ప‍్రధాన పాత్ర పోషించే అవకాశం ఉంది. బౌలింగ్ విభాగంలో చెన్నై కంటే సన్‌రైజర్స్ కాస్త మెరుగ్గా ఉంది. లీగ్ దశలో సన్‌రైజర్స్ వరుస విజయాల్లో బౌలర్లు ముఖ్య పాత్ర పోషించారు. ప్రధానంగా సన్‌రైజర్స్ స్వల్ప స్కోర్లను కాపాడుకుని ప్లేఆఫ్‌కు చేరిన తొలి జట్టుగా నిలిచింది. దాంతో తొలి ఫైనల్ బెర్త్‌ను ఎవరు ఖాయం చేసుకుంటారనేది ఆసక్తికరం.
తుదిజట్లు
సన్‌రైజర్స్ హైదరాబాద్
కేన్ విలియమ్సన్(కెప్టెన్), శిఖర్ ధావన్, శ్రీవాత్స్ గోస్వామి, మనీష్ పాండే, యుసుఫ్ పఠాన్, షకీబుల్ హసన్, కార్లొస్ బ్రాత్‌వైట్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, సిద్దార్థ్ కౌల్, సందీప్ శర్మ
చెన్నై సూపర్‌కింగ్స్
ఎంఎస్ ధోని(కెప్టెన్), షేన్ వాట్సన్, అంబటి రాయుడు, సురేశ్ రైనా, డుప్లెసిస్, రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రేవో, హర్భజన్ సింగ్, దీపక్ చహర్, శార్దూల్ ఠాకూర్, లుంగి ఎన్‌గిడి
Comments
Please login to add a commentAdd a comment