సిడ్నీ : కరోనా వైరస్ నేపథ్యంలో క్రీడలన్నీ వాయిదా పడిన సంగతి తెలిసిందే. కరోనా మహమ్మరి ప్రభావం తగ్గాక కూడా కొన్ని రోజుల వరకు ఏ సిరీస్ అయినా మైదానంలో ప్రేక్షకులు లేకుండానే జరుగుతాయి. తాజాగా ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఒక ఇంటర్వ్యూలో దీనిపై స్పందించాడు. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కరోనా మహమ్మారి నుంచి కోలుకుంటుండడం సంతోషంగా ఉందన్నాడు. కరోనా కారణంగా ఇంగ్లండ్, స్కాట్లాండ్లో తమ జట్టు పర్యటనలు షెడ్యూల్ ప్రకారం జరుగకపోవచ్చని ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ పేర్కొన్నాడు.
('మెక్‌గ్రాత్ గుర్తుంచుకో.. నేనింకా క్రీజులోనే ఉన్నా')
'ఇంగ్లండ్‌లో ప్రస్తుతం కరోనా మహమ్మారి తీవ్రత ఎక్కువగానే ఉంది. కరోనా ప్రభావం తగ్గితేనే మళ్లీ క్రీడలు ప్రారంభమయ్యేందుకు అవకాశం ఉంటుంది. అయితే మునుపటిలా మాత్రం స్టేడియాలు నిండకపోవచ్చు. ఇలా అయితే మాకు కూడా మ్యాచ్‌లు ఆడడం కష్టమవుతుంది. నేను మాత్రం ప్రేక్షకుల సమక్షంలో మ్యాచ్‌లు ఆడేందుకు ఇష్టపడతా. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఎక్కడ ఆడినా ప్రేక్షకుల మధ్యే ఆడాలని కోరుకుంటా. కరోనా కట్టడి కోసం ఆస్ట్రేలియా అద్భుతంగా పని చేస్తున్నదంటూ' వార్నర్ చెప్పుకొచ్చాడు. ఆస్ట్రేలియా జట్టు స్కాట్లాండ్తో జూన్ 29న ఒక టీ20 ఆడాల్సి ఉంది. అలాగే ఇంగ్లండ్‌తో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు జూలైలో ఆస్ట్రేలియా ఇంగ్లండ్‌లో పర్యటించాల్సి ఉంది.
('రసెల్‌తో ఆడితే హైలెట్స్ చూస్తున్నట్లే అనిపిస్తుంది')
(వార్నర్-క్యాండిస్‌ల ‘వేషాలు’ చూడండి..!)
Comments
Please login to add a commentAdd a comment