
సాక్షి, బెంగళూరు: ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్‌పై ఆ దేశ మాజీ క్రికెటర్ రోడ్నీహాగ్ చేసిన సంచలన వ్యాఖ్యల నేపథ్యంలో స్మిత్‌కు వార్నర్ మద్దతుగా నిలిచారు. జట్టులోకి తన స్నేహితులను ఎంపిక చేస్తున్నాడని రోడ్నీ చేసిన వ్యాఖ్యలపై వార్నర్ స్పందించారు.‘ ప్రతి ఒక్కరు అభిప్రాయాలను వ్యక్తం చేయవచ్చు. కానీ వారి ఉద్దేశ్యాలను మా పై ఎందుకు రుద్దుతున్నారో తెలియడం లేదు. జట్టును సెలక్టర్లు మ్యాచ్ ముందు రోజు ఎంపిక చేస్తారు. జట్టు ఎంపిక ఆటగాళ్ల చేతిలో లేదు అద్భుత ప్రదర్శన కనబర్చడమే ఆటగాళ్ల పని.’ అని బెంగళూరులో స్మిత్‌కు మద్దతుగా మీడియాతో మాట్లాడారు.
ఇక వరుస వన్డేల్లో ఓడి సిరీస్ చేజారడం పట్ల రోడ్నీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. స్మిత్ తన జాతీయ టీమ్ మెట్స్‌ను జట్టులోకి తీసుకుంటున్నాడని ఆరోపించారు. ఐదు వన్డేల సిరీస్‌లో 3-0తో భారత్ సిరీస్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.