37 ఏళ్ల రికార్డు బద్ధలైంది! | dawson breaks 37 years england 8th wicket record | Sakshi
Sakshi News home page

37 ఏళ్ల రికార్డు బద్ధలైంది!

Published Sat, Dec 17 2016 3:52 PM | Last Updated on Mon, Sep 4 2017 10:58 PM

37 ఏళ్ల రికార్డు బద్ధలైంది!

37 ఏళ్ల రికార్డు బద్ధలైంది!

చెన్నై: భారత్ తో ఇక్కడ జరుగుతున్న చివరి టెస్టులో ఇంగ్లండ్ క్రికెటర్ డాసన్ ఒక రికార్డును సవరించాడు. ఈ మ్యాచ్ ద్వారా టెస్టుల్లో అరంగేట్రం చేసిన  డాసన్(66 నాటౌట్;148 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్) అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్లో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ దిగిన డాసన్ 60కు పైగా పరుగులు సాధించాడు. తద్వారా ఎనిమిదో వికెట్గా దిగి అరంగేట్రం టెస్టుల్లో ఇంగ్లండ్ తరపున  అత్యధిక స్కోరు సాధించిన రికార్డు సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో ఇప్పటివరకూ డేవిడ్ బెయిర్ స్టో(59)పేరిట ఉన్న రికార్డును బద్ధలు కొట్టాడు. 1979లో డేవిడ్ బెయిర్ స్టో తన అరంగేట్రం టెస్టులో ఎనిమిదో స్థానంలో దిగి  అత్యధిక స్కోరు  సాధించాడు. ఆ సమయంలో డేవిడ్ బెయిర్ స్టో సాధించిన రికార్డుకు కూడా భారత్పైనే కావడం విశేషం. తాజాగా ఆ స్కోరును డాసన్ అధిగమించడంతో 37 ఏళ్ల రికార్డు తెరమరుగైంది.

ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 477 పరుగుల భారీ స్కోరు సాధించింది. బెయిర్ స్టో(49), మొయిన్ అలీ(146)లు రాణించి ఇంగ్లండ్ భారీ స్కోరుకు బాటలు వేశారు. ఆ తరువాత డాసన్, రషిద్(60)లు హాఫ్ సెంచరీలతో మెరిసి ఇంగ్లండ్ ను మరితం పటిష్ట స్థితికి తీసుకెళ్లారు. ఈ జోడి ఎనిమిదో వికెట్కు 108 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించింది. దాంతో చెపాక్ స్టేడియంలో ఎనిమిదో వికెట్కు రెండో అత్యుత్తమ భాగస్వామ్యాన్ని నమోదు చేసింది.  ఈ స్టేడియంలో అత్యుత్తమ భాగస్వామ ఎనిమిదో వికెట్ భాగస్వామ్యం  ఇమ్రాన్ ఖాన్-వసీం అక్రమ్లు జంట పేరిట ఉంది. 1987లో ఇమ్రాన్-వసీంలు ఇక్కడ నమోదు చేసిన 112 పరుగులు నేటికీ అత్యుత్తమ భాగస్వామ్యం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement