
జోరుగా ఢిల్లీ బ్యాటింగ్
ఐపీఎల్-8లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ తొలి 10 ఓవర్లలో వికెట్ నష్టపోయి 91 పరుగులు చేసింది.
బెంగళూరు: ఐపీఎల్-8లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ తొలి 10 ఓవర్లలో వికెట్ నష్టపోయి 91 పరుగులు చేసింది. ఢిల్లీ ఓపెనర్లు క్వింటన్ డికాక్, శ్రేయాస్ అయ్యర్ దాటిగా ఆడటంతో ఆరు ఓవర్లలో ఆ జట్టు 54 పరుగులు చేసింది. అయితే జట్టు స్కోరు 55 పరుగుల వద్ద శ్రేయాస్ అయ్యర్ (20) ఔటయ్యాడు. డికాక్ కేవలం 30 బంతుల్లోనే 8 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో అర్ధ శతకం సాధించాడు. ప్రస్తుతం డికాక్(33 బంతుల్లో 52), కెప్టెన్ జేపీ డుమిని(9 బంతుల్లో 15) క్రీజులో ఉన్నారు. బెంగళూరు బౌలర్ హర్షల్ పటేల్ ఒక్క వికెట్ తీశాడు.