ఐపీఎల్-8 లో భాగంగా మంగళవారం ఇక్కడ ఢిల్లీ డేర్ డెవిల్స్తో జరుగుతున్న మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది.
రాయ్పూర్: ఐపీఎల్-8 లో భాగంగా మంగళవారం ఇక్కడ ఢిల్లీ డేర్ డెవిల్స్తో జరుగుతున్న మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. దాంతో ప్రత్యర్థి ఢిల్లీకి 120 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. తొలుత ఓపెనర్లుగా దిగిన మెకల్లమ్ (11), డ్వేన్ స్మిత్ (18) పరుగులు చేసి వెనుదిరిగారు.
ఆ తరువాత వచ్చిన మిగతా ఆటగాళ్లు రైనా (11), డుప్లెసిస్(29), బ్రేవో(8), ధోనీ(27)లు పరుగులు చేసి అవుట్ అయ్యారు. పవన్(5), జడేజా (3) పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు.
ఢిల్లీ బౌలర్లు జహీర్, మెర్కెల్ లు తలా రెండు వికెట్లు తీయగా సంధూ,జయంత్ లు తలో వికెట్ తీశారు..