ఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో భాగంగా గురువారం ఇక్కడ ఫిరోజ్ షా కోట్ల మైదానంలో గుజరాత్ లయన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ కరుణ్ నాయర్ తొలుత ఫీల్డింగ్ తీసుకునేందుకు మొగ్గు చూపాడు.ఈ సీజన్‌లో ఢిల్లీ-గుజరాత్ లకు ఇదే తొలి మ్యాచ్.
ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై అవ్వాలంటే ప్రతీ మ్యాచ్ నెగ్గాల్సిన స్థితిలో ఉన్న ఢిల్లీ.. ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలని కృతనిశ్చయంతో ఉంది. మరోవైపు గత రెండు మ్యాచ్‌ల్లో త్రుటిలో విజయాన్ని కోల్పోయిన గుజరాత్ ఈ మ్యాచ్‌లో ఎలాగైనా నెగ్గాలని బరిలోకి దిగనుంది.
గుజరాత్ తుది జట్టు: సురేశ్ రైనా(కెప్టెన్), అరోన్ ఫించ్, డ్వేన్ స్మిత్, దినేశ్ కార్తీక్, ఇషాన్ కిషన్, బ్రెండన్ మెకల్లమ్, రవీంద్ర జడేజా, ఫాల్కనర్, సంగ్వాన్, బాసిల్ తంపి, అంకిత్ సోని
ఢిల్లీ తుది జట్టు: కరుణ్ నాయర్(కెప్టెన్), సంజూ శాంసన్, మార్లోన్ శామ్యూల్స్, రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, కోరీ అండర్సన్, ప్యాట్ కమిన్స్, రబడా, నదీమ్, అమిత్ మిశ్రా, మొహ్మద్ షమీ
ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ
Published Thu, May 4 2017 7:50 PM | Last Updated on Tue, Aug 21 2018 2:28 PM
Advertisement
Advertisement