
జొహర్ బారు (మలేసియా): సుల్తాన్ జొహర్ కప్‌లో భారత జూనియర్ హాకీ జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. తొలి రెండు మ్యాచ్‌లు నెగ్గిన భారత్ మంగళవారం జరిగిన మూడో మ్యాచ్‌లో 1–0తో జపాన్‌పై గెలిచి హ్యాట్రిక్ విజయాలు సొంతం చేసుకుంది. మ్యాచ్‌లో నమోదైన ఏకైక గోల్ కెప్టెన్ మనదీప్ మోర్ (42వ ని.లో) సాధించాడు.
వర్షం ఆటంకం కలిగించిన ఈ మ్యాచ్‌లో మన కుర్రాళ్లు చక్కటి డిఫెన్స్‌తో ఆకట్టుకున్నారు. మూడో క్వార్టర్‌లో లభించిన రెండు పెనాల్టీ కార్నర్ అవకాశాల్లో భారత్ ఒకదాన్ని సద్వినియోగం చేసుకొని 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత అదే ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ... 1–0తో మ్యాచ్‌ను ముగించింది. నేడు జరిగే మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది.
Comments
Please login to add a commentAdd a comment