హాకీ ఇండియా లీగ్‌లో | Dhanraj Pillay Bats for Pakistanis' Participation in HIL | Sakshi
Sakshi News home page

హాకీ ఇండియా లీగ్‌లో

Published Tue, Oct 13 2015 1:02 AM | Last Updated on Sun, Sep 3 2017 10:51 AM

హాకీ ఇండియా లీగ్‌లో

హాకీ ఇండియా లీగ్‌లో

 పాక్ ఆటగాళ్లూ ఆడాలి
 భారత మాజీ కెప్టెన్ ధన్‌రాజ్ పిళ్లై
 
 బెంగళూరు: హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్)లో పాకిస్తాన్ ఆటగాళ్లను కూడా అనుమతించాలని భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ ధన్‌రాజ్ పిళ్లై అభిప్రాయపడ్డారు. ఈమేరకు నిర్వాహకులు రాజకీయ నాయకుల నుంచి అనుమతి తీసుకోవాలని సూచించారు. ఈ విషయంలో వారి నుంచి సానుకూలత వస్తుందనే ఆశిస్తున్నట్టు చెప్పారు. ‘గతేడాది చాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్లో పాక్ ఆటగాళ్ల అనుచిత ప్రవర్తనకు క్షమాపణలు చెప్పేందుకు వారు నిరాకరిస్తున్నారు. అందుకే ఈ సమస్యంతా వచ్చింది. అయితే హాకీ ఇండియా (హెచ్‌ఐ) రాజకీయ నాయకులను కలిస్తే సమస్య పరిష్కారమవుతుంది. అలాగే హెచ్‌ఐఎల్ నిర్వాహకులు కొంత మొత్తాన్ని దేశంలో హాకీని అభివృద్ధి చేసేలా అకాడమీల ఏర్పాటు కోసం కేటాయించాలి’ అని పిళ్లై సూచించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement