దుబాయ్: ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్కు అంపైర్లను ఎంపిక చేశారు. ఆదివారం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ల మధ్య జరిగే ఫైనల్ సమరంలో కుమార్ ధర్మసేన (శ్రీలంక), రిచర్డ్ కెటిల్బరో ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరించనున్నారు. శుక్రవారం ఐసీసీ ఈ మేరకు ఓ ప్రకటనలో తెలిపింది. ఇక రంజన్ మదుగల్లెను (శ్రీలంక) మ్యాచ్ రెఫరీగా ఎంపిక చేశారు. ఎరాస్మస్ను థర్డ్ అంపైర్గా, ఇయాన్ గుడ్ను రిజర్వ్ అంపైర్గా నియమించారు.