కోహ్లిని మిస్సవుతున్నారా.. నెక్ట్స్‌ క్వశ్చన్‌ ప్లీజ్‌! | Did you miss Virat Kohli, reporter asks. Khaleel Ahmed bursts out laughing | Sakshi
Sakshi News home page

కోహ్లిని మిస్సవుతున్నారా.. నెక్ట్స్‌ క్వశ్చన్‌ ప్లీజ్‌!

Published Sat, Feb 9 2019 2:08 PM | Last Updated on Sat, Feb 9 2019 3:09 PM

Did you miss Virat Kohli, reporter asks. Khaleel Ahmed bursts out laughing - Sakshi

ఆక్లాండ్‌: గతేడాది సెప్టెంబర్‌లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఖలీల్‌ అహ్మద్‌ ఇప్పటివరకూ భారత్‌ తరఫున 16 మ్యాచ్‌లు ఆడాడు. భారత్‌ పేస్‌ బౌలింగ్‌ను పరీక్షించే క్రమంలో అతనికి అవకాశాలు బాగానే వస్తున్నాయి. ఒకవైపు ఇషాంత్‌ శర్మ, ఉమేశ్‌ యాదవ్‌ వంటి సీనియర్లు ఉన్నప్పటికీ ఖలీల్‌పై సెలక్టర్లు నమ్మకం ఉంచుతూ వరుస అవకాశాలు ఇస్తున్నారు. తనకు వచ్చిన అవకాశాల్ని నిలబెట్టుకునేందుకు తీవ్రంగా యత్నిస్తున్న ఈ యువ పేసర్‌.. మైక్‌ ముందు మాట్లాడేటప్పుడు మాత్రం తడబాటుకు గురువుతున్నాడు.

న్యూజిలాండ్‌తో రెండో టీ20లో భారత్‌ విజయం సాధించిన తర్వాత జట్టు తరుఫున పోస్ట్‌ మ్యాచ్‌ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌కు హాజరైన ఖలీల్‌.. పలు ప్రశ్నలకు జవాబు ఇచ్చే సమయంలో ఆందోళనకు గురయ్యాడు. ఈ క‍్రమంలోనే కోహ్లి గురించి ఓ రిపోర్టర్‌ అడిగిన ప్రశ్నకు ఖలీల్‌ వద్ద సమాధానమే లేకుండా పోయింది. అది చాలా సింపుల్‌ ప‍్రశ్న అయినప్పటికీ ఖలీల్‌ మాత్రం ఏమి చెబితే ఏమి అవుతుందో అనే సందిగ్ధంలో తటపటాయించాడు. ఇంతకీ ఆ రిపోర్టర్‌ అడిగిన ప్రశ్న ఏమిటంటే.. ‘ మీరు(జట్టు సభ్యులు) విరాట్‌ కోహ్లిని మిస్సవుతున్నారా’ అని అడగ్గా ఖలీల్‌ ఒక్కసారిగా నవ్వేశాడు. అందుకు సమాధానం పూర్తిగా ఇవ్వకుండానే ‘నెక్స్‌ క్వశ్చన్‌ ప్లీజ్‌’ అంటూ అడగడం ఖలీల్‌ తడబాటుకు అద్దం పడుతోంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement