సాధారణ ఎన్నికలు 2014లో జరగనున్న నేపథ్యంలో ఐపీఎల్ ఏడో సీజన్ మ్యాచ్‌లను ఎక్కడ నిర్వహించాలనే విషయంపై ఆదివారం జరిగిన లీగ్ పాలక మండలి సభ్యులు చర్చించారు.
ముంబై: సాధారణ ఎన్నికలు 2014లో జరగనున్న నేపథ్యంలో ఐపీఎల్ ఏడో సీజన్ మ్యాచ్‌లను ఎక్కడ నిర్వహించాలనే విషయంపై ఆదివారం జరిగిన లీగ్ పాలక మండలి సభ్యులు చర్చించారు. ‘ఎన్నికలకు ముందు కానీ ఆ తర్వాత కానీ ఆయా ప్రభుత్వాలు మ్యాచ్‌లకు భద్రత కల్పించడం చాలా కష్టంతో కూడుకుంది. మా ప్రయత్నమంతా మ్యాచ్‌లను భారత్‌లోనే జరిపించాలని చూస్తున్నాం. ఒకవేళ ఎన్నికల తేదీల్లోనే లీగ్ షెడ్యూల్ ఉంటే మ్యాచ్‌లను ఇక్కడి నుంచి తరలించడం మినహా మార్గం లేదు. అయితే అన్ని మార్గాల గురించి అన్వేషిస్తున్నాం’ అని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కొన్ని మ్యాచ్‌ల సమయంలో ఎన్నికలు ఉంటే వాటిని శ్రీలంకకు తరలించే అవకాశం ఉంది.