జొకోవిచ్ పాంచ్ పటాకా | Djokovic defeats A.Murray in australia open final | Sakshi
Sakshi News home page

జొకోవిచ్ పాంచ్ పటాకా

Published Sun, Feb 1 2015 6:18 PM | Last Updated on Sat, Sep 2 2017 8:38 PM

జొకోవిచ్ పాంచ్ పటాకా

జొకోవిచ్ పాంచ్ పటాకా

మెల్ బోర్న్:ఆస్ట్రేలియా ఓపెన్ లో నిలకడగా ఆడుతూ, అంచనాలను నిజం చేస్తూ ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) మరోసారి టైటిల్ ను కైవశం చేసుకున్నాడు. ఆదివారం ఇక్కడ జరిగిన పురుషుల ఫైనల్లో జొకోవిచ్ 7-6(7-5), 6-7(4-7),6-3, 6-0 తేడాతో బ్రిటన్ స్టార్ ఆటగాడు ఆండీ ముర్రేను మట్టికరిపించి ఐదో సారి టైటిల్ ను ఎగురేసుకుపోయాడు. ఈ టోర్నీలో ఆద్యంతం ఆకట్టుకున్న జొకోవిచ్.. ఫైనల్లో ముర్రే నుంచి తీవ్ర ప్రతి ఘటనను ఎదుర్కొన్నాడు.

 

తొలి సెట్ ట్రై బ్రేక్ దారి తీసినా.. జొకోవిచ్ తన అనుభవాన్ని ఉపయోగించి ఆ సెట్ ను కైవశం చేసుకుని ముందంజ వేశాడు. అయితే రెండో సెట్  ను ముర్రే గెలుచుకుని జొకోవిచ్ కు సవాల్ విసిరాడు. ఇక మూడు, నాల్గో సెట్లను అవలీలగా గెలుచుకున్న జొకోవిచ్ ఐదో సారి టైటిల్ ను చేజిక్కించుకున్నాడు. ఇంతకుముందు 2008, 2011,2012, 2013 సంవత్సరాల్లో జొకోవిచ్ ఆస్ట్రేలియా ఓపెన్ ను దక్కించుకున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement