
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మేనేజ్‌మెంట్ (హితమ్) స్పోర్ట్స్ ఫెస్ట్ సంగ్రామ్‌లో డీఆర్‌కే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (బౌరంపేట్) జట్టు ఆకట్టుకుంది. టేబుల్ టెన్నిస్ ఈవెంట్‌లో డీఆర్‌కే జట్టు విజేతగా నిలిచింది. ఆతిథ్య హితమ్ (మేడ్చల్) కాలేజి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. వాలీబాల్ బాలుర విభాగంలో మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజి (మైసమ్మగూడ), హితమ్ కాలేజి (మేడ్చల్)... బాలికల కేటగిరీలో బీవీ రాజు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నర్సాపూర్), ఎంఎల్‌ఆర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (మేడ్చల్) వరుసగా తొలి రెండు స్థానాల్లో నిలిచాయి.
త్రోబాల్ ఈవెంట్‌లో బీవీ రాజు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నర్సాపూర్) టైటిల్‌ను గెలుచుకోగా... డీఆర్‌కే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ రెండోస్థానంలో నిలిచింది. కబడ్డీలో వీఎన్‌ఆర్, హితమ్ జట్లు తొలి రెండు స్థానాలను సాధించాయి. బాస్కెట్‌బాల్ ఈవెంట్‌లో వీఎన్‌ఆర్ వీజేఈటీ (బాచుపల్లి), మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజి (మైసమ్మగూడ)... క్రికెట్‌లో సెయింట్ మార్టిన్స్ ఇంజనీరింగ్ కాలేజి (దూలపల్లి), సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజి (మేడ్చల్) జట్లు వరుసగా తొలి రెండు స్థానాలను సాధించాయి. రెండు రోజులపాటు జరిగిన ఈ టోర్నీలో మొత్తం 17 కాలేజీలకు చెందిన 600 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment