సెయింట్ లూయిస్ (అమెరికా): కెయిన్స్ కప్ అంతర్జాతీయ మహిళల చెస్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక వరుసగా ఐదో ‘డ్రా’ నమోదు చేసింది. అంతర్జాతీయ మాస్టర్ (ఐఎం) అనా జటోన్‌స్కీ (అమెరికా)తో జరిగిన ఐదో గేమ్‌ను నల్ల పావులతో ఆడిన హారిక 49 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది.
పది మంది మేటి క్రీడాకారిణుల మధ్య జరుగుతున్న ఈ టోర్నీలో ఐదో రౌండ్ తర్వాత హారిక 2.5 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. 4.5 పాయింట్లతో ప్రపంచ మాజీ చాంపియన్ అలెగ్జాండ్రా కొస్టెనిక్ (రష్యా) అగ్ర స్థానంలో ఉంది.
హారిక ఐదో ‘డ్రా’
Published Tue, Feb 12 2019 12:10 AM | Last Updated on Tue, Feb 12 2019 12:10 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment