దుతీచంద్‌కు ఊరట
అంతర్జాతీయ ఈవెంట్స్‌లో పాల్గొనేందుకు కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ అనుమతి
లాసానే: భారత మహిళా అథ్లెట్ దుతీచంద్‌కు ఊరట లభించింది. ఇకపై ఆమె అన్ని స్థాయిల్లోని మహిళల ఈవెంట్లలో పాల్గొనవచ్చని ఇక్కడి కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ (సీఏఎస్) తీర్పు ఇచ్చింది. ‘హైపరాండ్రోజెనిజమ్’ కారణంగా ఆమెలో పురుష లక్షణాలు ఉన్నాయని, ఆమె మహిళల విభాగంలో పోటీకి అనర్హురాలని భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్‌ఐ), అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య (ఐఏఏఎఫ్) ఆమెపై నిషేధం విధించింది. దీనిపై దుతీ సీఏఎస్‌ను ఆశ్రయించింది. ఆమె శరీరంలో టెస్టోస్టిరాన్ మోతాదుకు మించి ఉండటం వల్ల పోటీల్లో ఆమె అదనపు ప్రయోజనం పొందిందనడానికి ఎలాంటి రుజువు లేదని సీఏఎస్ అభిప్రాయపడింది. ఐఏఏఎఫ్‌లోని హైపరాండ్రోజెనిజమ్ నిబంధనలనే మొత్తంగా రద్దు చేస్తూ దుతీకి అంతర్జాతీయ ఈవెంట్లలో పాల్గొనేందుకు అనుమతి ఇచ్చింది. గత ఏడాది డిసెంబర్‌లోనే దేశవాళీ పోటీల్లో పాల్గొనవచ్చని సీఏఎస్ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దాంతో ఆమె కేరళ జాతీయ క్రీడల్లో పాల్గొని స్వర్ణం గెలుచుకుంది.
స్పెషల్ ఒలింపిక్స్‌లో భారత్‌కు కాంస్య పతకం
లాస్ ఏంజిలిస్: స్పెషల్ ఒలింపిక్స్ ప్రపంచ క్రీడల్లో భారత్‌కు తొలి పతకం లభించింది. 13 ఏళ్ల ఢిల్లీ టీనేజర్ యాష్ సింగ్ అక్వాటిక్స్‌లో కాంస్యం సాధిం చాడు. ఇది తనకు తొలి అంతర్జాతీయ ఈవెంట్ కావడం విశేషం. 25మీ. బ్యాక్‌స్ట్రోక్‌లో తను 19.23 సెకన్ల టైమింగ్‌తో గమ్యం చేరాడు. పాక్షిక వైకల్యం కలిగిన ఆటగాళ్లు ఇందులో పాల్గొంటారు. యాష్‌కు పుట్టుకతోనే బధిర సమస్యలున్నాయి.
ఈ తీర్పు పట్ల చాలా సంతోషంగా ఉన్నాం. 19 ఏళ్ల యువ అథ్లెట్ కెరీర్ నిలబడింది. భవిష్యత్తులో ఆమె మరింత బాగా ఆడి దేశం తరఫున పతకాలు సాధిస్తుంది. అదే లక్ష్యంతో ప్రస్తుతం ఆమెకు ఇక్కడే హైదరాబాద్‌లోనే ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాను.
-ఎన్. రమేశ్, దుతీచంద్ వ్యక్తిగత కోచ్