లెడెకీ మరో ప్రపంచ రికార్డు | Emotional Journey For Katie Ledecky Ends in Rio | Sakshi
Sakshi News home page

లెడెకీ మరో ప్రపంచ రికార్డు

Published Sun, Aug 14 2016 1:58 AM | Last Updated on Mon, Sep 4 2017 9:08 AM

లెడెకీ మరో ప్రపంచ రికార్డు

లెడెకీ మరో ప్రపంచ రికార్డు

 స్విమ్మింగ్‌లో 19 ఏళ్ల అమెరికా స్టార్ కేటీ లెడెకీ దూసుకుపోతోంది. 800 మీటర్ల ఫ్రీ స్టయిల్ విభాగంలో ఆమె కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పి స్వర్ణ పతకం సొంతం చేసుకుంది. 8 ని. 4.79 సెకన్లతో మీట్ పూర్తి చేసిన లెడెకీ తన పేరిటే ఉన్న రికార్డు (8 ని. 6.68 సె.)ను సవరించింది. తాజా ఫలితంతో ఆమె 48 ఏళ్ల తర్వాత ఒకే ఒలింపిక్స్‌లో 200 మీ., 400 మీ., 800 మీ. ఫ్రీ స్టయిల్ పోటీలు నెగ్గిన అరుదైన స్విమ్మర్‌గా రికార్డు సృష్టించింది. 1968లో డెబీ మేయర్ ఈ ఘనత సాధించింది. ఈ ఈవెంట్‌లో జాజ్ కార్లిన్ (బ్రిటన్- 8 ని. 16.17 సె.), బొగ్లార్కా కపస్ (హంగేరీ - 8 ని. 16.37 సె.) రజత, కాంస్యాలు నెగ్గారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement