లండన్: వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్ ఆఖరి ఓవర్‌లో ఓవర్ త్రో అయిన బంతికి ఇంగ్లండ్‌కు ఆరు పరగులు కాకుండా ఐదు పరుగులే రావాల్సి ఉందని, ఆ విషయంలో అంపైర్లు తప్పు చేశారని మాజీ అంపైర్ సైమన్ టఫెల్ పేర్కొన్న విషయం తెలిసిందే. ఫీల్డర్ బంతి విసరకముందే బ్యాట్స్‌మెన్ ఒకరినొకరు దాటితే ఆ పరుగును లెక్కించాలని, కానీ బెన్‌స్టోక్స్, అదిల్ రషీద్ రెండో పరుగు తీయకముందే ఫీల్డర్ బంతిని విసిరాడని తెలిపారు. అప్పుడు ఐదు పరుగులే లెక్కించి అదిల్ రషీద్‌ను బ్యాటింగ్ చెయ్యాల్సి ఉండేదని ఫీల్డ్ అంపైర్ల నిర్ణయాన్ని టఫెల్ తప్పుబట్టారు.
ఈ విషయంపై ఇంగ్లండ్ క్రికెట్ డైరెక్టర్ ఆష్లీ గిల్స్ మీడియాతో మాట్లాడుతూ.. టఫెల్ వ్యాఖ్యలను తోసిపుచ్చారు. ‘మీరొక విషయంపై చర్చించాలి.. ఆఖరి ఓవర్‌లో ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్ చేస్తుండగా బెన్‌స్టోక్స్ చివరి బంతి ఆడేటప్పుడు బంతి లెగ్ స్టంప్ మీద ఫుల్‌టాస్ పడింది. ఆ సమయంలో స్టోక్స్ రెండు పరుగుల కోసం ఆలోచించకుండా ఉంటే బంతిని స్టేడియం బయటకు పంపేవాడు. అవి మాకు అవసరమైన పరుగులు కాబట్టి స్టోక్స్ కూల్‌గానే ఆడాడు. ఒకవేళ ఆఖరి బంతి లక్ష్యం ఇంకా ఎక్కువ ఉంటే స్టోక్స్ సిక్స్‌తోనే సమాధానం చెప్పేవాడు. మేం ఇప్పుడు వరల్డ్ చాంపియన్స్. కప్పు మాకే వచ్చింది’ అని ఈ ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment