
'పీటర్సన్ లేకపోతే కష్టం'
త్వరలో ఇంగ్లండలో ఆరంభం కానున్న యాషెస్ సిరీస్ లో కెవిన్ పీటర్సన్ ఆడకపోవడం ఆసీస్ కు కలిసొస్తుందని ఆసీస్ కెప్టెన్ మైకేల్ క్లార్క్ స్పష్టం చేశాడు.
సిడ్నీ: త్వరలో ఇంగ్లండలో ఆరంభం కానున్న యాషెస్ సిరీస్ లో కెవిన్ పీటర్సన్ ఆడకపోవడం ఆసీస్ కు కలిసొస్తుందని ఆసీస్ కెప్టెన్ మైకేల్ క్లార్క్ స్పష్టం చేశాడు. గత 2013-14 యాషెస్ సిరీస్ లో ఇంగ్లండ్ ఇదే తీరును అవలంభించి 5-0 తేడాతో ఓటమి పాలైన సంగతిని క్లార్క్ గుర్తు చేశాడు. ఇంగ్లండ్ జట్టులో పీటర్సన్ లేకపోవడం కచ్చితంగా ఆసీస్ కు కలిసొస్తుందన్నాడు. ఇటీవల వెస్టిండీస్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో పరాజయం పాలైన ఇంగ్లండ్ .. యాషెస్ లో కూడా అదే పరాభావం ఎదుర్కొంటుందని జోస్యం చెప్పాడు. పీటర్సన్ మంచి ఆటగాడే కాకుండా .. అతని ఆటతీరు నిజంగా అద్భుతంగా ఉంటుందన్నాడు. పీటర్సన్ ను తిరిగి ఇంగ్లండ్ జట్టులోకి రావాలని కోరుకుంటున్నట్లు క్లార్క్ తెలిపాడు.జూలై 8 వ తేదీ నుంచి యాషెష్ సిరీస్ ఆరంభం అవుతున్న సంగతి తెలిసిందే.
2013లో స్ట్రాస్ ఇంగ్లండ్ కెప్టెన్‌గా ఉన్న సమయంలో దక్షిణాఫ్రికాతో సిరీస్ సందర్భంగా పీటర్సన్... స్ట్రాస్ గురించి ప్రత్యర్థి క్రికెటర్లకు సందేశాలు పంపించాడు. దీంతో అతణ్ని జట్టు నుంచి బహిష్కరణకు గురైయ్యాడు. అప్పట్నుంచీ ఇప్పటివరకూ పీటర్సన్ తన ఫామ్ చాటుకుంటూ జట్టులో చోటు సంపాదించడం కోసం యత్నిస్తున్నాడు. ఇంగ్లండ్ జట్టలో కి రావడానికి ఐపీఎల్ ను సైతం వదిలేసుకున్నాడు పీటర్సన్.