
హఫీజ్ డబుల్ సెంచరీ
పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 537/5
బంగ్లాతో తొలి టెస్టు
కుల్నా: బంగ్లాదేశ్‌తో వన్డే, టి20 సిరీస్‌లో పేలవ ప్రదర్శన చేసిన పాకిస్తాన్ జట్టు టెస్టు సిరీస్‌లో మాత్రం నిలకడగా ఆడుతోంది. తొలి టెస్టులో బంగ్లాదేశ్ స్కోరుకు పాక్ జట్టు భారీస్కోరుతోనే దీటైన జవాబు ఇచ్చింది. ఓపెనర్ మహ్మద్ హఫీజ్ (332 బంతుల్లో 224; 23 ఫోర్లు, 3 సిక్సర్లు) కెరీర్‌లో తొలి డబుల్ సెంచరీ చేయడంతోపాటు మరో నలుగురు బ్యాట్స్‌మెన్ అర్ధ సెంచరీలు సాధించడంతో... మూడో రోజు ఆట ముగిసే సమయానికి పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 148 ఓవర్లలో 5 వికెట్లకు 537 పరుగులు చేసి 205 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. అసద్ షఫీక్ (51 బ్యాటింగ్; 5 ఫోర్లు), సర్ఫరాజ్ అహ్మద్ (51 బ్యాటింగ్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) క్రీజులో ఉన్నారు.
ఓవర్‌నైట్ స్కోరు 227/1తో ఆట కొనసాగించిన పాక్ ఇన్నింగ్స్‌లో హఫీజ్ కీలక భాగస్వామ్యాలతో చెలరేగాడు. బంగ్లా బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చలాయిస్తూ పరుగుల వరద పారించాడు. అజహర్ అలీ (83; 4 ఫోర్లు, సిక్సర్)తో కలిసి రెండో వికెట్‌కు 227; యూనిస్ ఖాన్ (33)తో కలిసి మూడో వికెట్‌కు 62; మిస్బా (59; 4 ఫోర్లు, 2 సిక్సర్లు)తో కలిసి నాలుగో వికెట్‌కు 63 పరుగులు జోడించి అవుటయ్యాడు. తర్వాత వచ్చిన అసద్ షఫీక్ కూడా సమయోచితంగా రాణించాడు.
మిస్బాతో కలిసి ఐదో వికెట్‌కు 66; సర్ఫరాజ్‌తో కలిసి ఆరో వికెట్‌కు అజేయంగా 69 పరుగులు జోడించడంతో పాక్ భారీ స్కోరు ఖాయమైంది. బంగ్లాదేశ్ బౌలర్లలో తైజుల్ ఇస్లామ్ 3, షివుగటా 2 వికెట్లు తీశారు. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 332 పరుగులకు ఆలౌటైంది.