T20 WC 2022 of Virat Kohli and Rohit Sharma falls: India to struggle against Pakistan, Viral - Sakshi
Sakshi News home page

"ఈ సారి కూడా విజ‌యం పాకిస్తాన్‌దే.. కోహ్లి, రోహిత్ త‌ప్ప‌..."

Published Sun, Jan 23 2022 2:35 PM | Last Updated on Thu, Jun 9 2022 6:18 PM

India to struggle against Pakistan in T20 WC 2022 of Virat Kohli and Rohit Sharma falls - Sakshi

India to struggle against Pakistan in T20 WC 2022: ఆస్ట్రేలియా వేదిక‌గా జ‌ర‌గ‌నున్న టీ20 ప్ర‌పంచ‌క‌ప్-2022 షెడ్యూల్‌ను ఐసీసీ ప్రకటించిన సంగ‌తి తెలిసిందే. అక్టోబర్ 23న మెల్‌బోర్న్ వేదిక‌గా టీమిండియా త‌మ తొలి మ్యాచ్‌లో దాయాది దేశం పాకిస్తాన్‌తో త‌ల‌ప‌డ‌నుంది. దీంతో మ‌రోసారి ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ వీక్షించేందుకు అభిమానులు అతృత‌గా ఎదురుచూస్తున్నారు.. కాగా ఇండియా-పాకిస్తాన్ హైవోల్టేజ్  మ్యాచ్‌కు ఇంకా తొమ్మిది నెలల సమయం ఉన్న‌ప్ప‌టికీ.. ఇప్ప‌టి నుంచే ఈ మ్యాచ్‌పై అనేక అంచ‌నాలు మెద‌ల‌య్యాయి. ఈ క్ర‌మంలో పాక్ మాజీ కెప్టెన్ మహ్మద్ హఫీజ్ ఆస‌క్తిక‌ర వాఖ్య‌లు చేశాడు.

"ప్ర‌స్తుతం పాకిస్తాన్ జ‌ట్టు రోజు రోజుకి ఎదుగుతోంది. ఈ సారి కూడా భార‌త్‌పై క‌చ్చితంగా గెలుస్తాం. టీమిండియాకు సంబంధించినంత‌వ‌ర‌కు విరాట్‌, రోహిత్ చాలా ముఖ్యమైన ఆటగాళ్లని నేను భావిస్తున్నాను. పాకిస్తాన్ వంటి మెరుగైన జ‌ట్టుల‌తో ఆడిన‌ప్పుడు.. ఈ ఇద్దరూ పరుగులు చేయకపోతే, ఇత‌ర ఆట‌గాళ్ల‌కు ఆడడం చాలా క‌ష్టం. ఇక ప్రపంచకప్‌లో భారత్‌పై పాకిస్తాన్ గెలిస్తే అందులో నేనూ భాగమవ్వాలనే కోరిక నాకు ఎప్పుడూ ఉండేది. నా కోరిక టీ20 ప్ర‌పంచ‌కప్‌-2021లో నేర‌వేరినందుకు, నేను గర్వపడుతున్నాను" అని మహ్మద్ హఫీజ్ పేర్కొన్నాడు. కాగా టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2021లో భార‌త్‌పై 10 వికెట్ల తేడాతో పాక్ గెలిపొందిన సంగ‌తి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement