
కోమాలో ఫార్ములా వన్ రేసర్ మైకేల్ షుమాకర్
ప్రాన్స్ : స్కై డైవింగ్ సరదా ఫార్ములా వన్ మాజీ ప్రపంచ చాంపియన్ మైకెల్ షుమాకర్ ప్రాణాల మీదకు తెచ్చింది. ఫ్రాన్స్‌లోని ఆల్ప్స్ పర్వత శ్రేణుల్లో షుమేకర్ ఆదివారం స్కీయింగ్ చేస్తూ ప్రమాదానికి గురయ్యాడు. ప్రస్తుతం షుమాకర్ కోమాలో ఉన్నాడు. ప్రమాదానికి గురైనపుడు షుమాకర్ హెల్మెట్ ధరించి వున్నాడు.
హెలికాప్టర్‌లో ఆస్పత్రికి తీసుకొచ్చాక కోమాలోకి వెళ్లడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా వుందని వైద్యులు గ్రహించారు. వెంటనే ఈ 44 ఏళ్ల ఈ జర్మన్ డ్రైవర్ మెదడుకు ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం షుమాకర్ పరిస్థితి విషమంగానే వుందని తెలిపారు. 1946లో తొలిసారిగా ఆరంభమయిన ఫార్ములా వన్ నాటి నుంచీ ఏ ఇతర డ్రైవరూ గెలవనన్ని ఫార్ములా వన్ చాంపియన్ షిప్ లతో పాటు పందేలనూ ఇతను గెలుచుకున్నాడు. షూమాకర్ తన చివరి ఫార్ములా రేస్‌ను 2004లో గెల్చుకున్నాడు.