ఫెడరర్, నాదల్‌ నాలుగోస్సారి... | fourth time, the title is ready for the title | Sakshi
Sakshi News home page

ఫెడరర్, నాదల్‌ నాలుగోస్సారి...

Published Sun, Oct 15 2017 1:15 AM | Last Updated on Sun, Oct 15 2017 3:24 AM

 fourth time, the title is ready for the title

టెన్నిస్‌ దిగ్గజాలు రోజర్‌ ఫెడరర్‌ (స్విట్జర్లాండ్‌), రాఫెల్‌ నాదల్‌ (స్పెయిన్‌) ఈ ఏడాది నాలుగోసారి టైటిల్‌ సమరంలో తలపడేందుకు సిద్ధమయ్యారు. షాంఘై ఓపెన్‌ ఏటీపీ మాస్టర్స్‌ టోర్నమెంట్‌లో ఈ ఇద్దరూ ఫైనల్లోకి దూసుకెళ్లారు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్స్‌లో నాదల్‌ 7–5, 7–6 (7/3)తో మారిన్‌ సిలిచ్‌ (క్రొయేషియా)పై, ఫెడరర్‌ 3–6, 6–3, 6–3తో డెల్‌పొట్రో (అర్జెంటీనా)పై గెలిచారు.

ఈ ఏడాది నాదల్‌తో ఆడిన మూడు ఫైనల్స్‌లో ఫెడరరే గెలిచాడు. ఓవరాల్‌గా వీరిద్దరు 38వ సారి పోటీపడుతుండగా... ముఖాముఖి రికార్డులో మాత్రం నాదల్‌ 24–13తో ఫెడరర్‌పై ఆధిక్యంలో ఉన్నాడు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement