
‘రంజీ క్రికెట్’ వచ్చేసింది...
నేటి నుంచి దేశవాళీ మెగా టోర్నీ
బరిలో 28 జట్లు అన్ని మ్యాచ్‌లు తటస్థ వేదికలపైనే
సాక్షి క్రీడావిభాగం : భారత దేశవాళీ క్రికెట్‌లో అతి పెద్ద టోర్నమెంట్ రంజీ ట్రోఫీకి రంగం సిద్ధమైంది. 83వ రంజీ టోర్నీ (2016-17 సీజన్) గురువారం ప్రారంభం అవుతోంది. వచ్చే ఏడాది జనవరి 7నుంచి ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఎప్పటిలాగే జట్లను మొత్తం మూడు గ్రూప్‌లు(ఎ, బి, సి)గా విభజించారు. ప్రత్యేక జట్టుగా గుర్తింపు కోసం దాదాపు దశాబ్దంన్నర పాటు పోరాడిన ఛత్తీస్‌గఢ్‌కు ఎట్టకేలకు రంజీ అవకాశం దక్కింది. దీంతో ఈ ఏడాది బరిలోకి దిగే జట్ల సంఖ్య 28కు పెరిగింది. సౌరవ్ గంగూలీ నేతృత్వంలోనే టెక్నికల్ కమిటీ సిఫారసు మేరకు తొలిసారి అన్ని మ్యాచ్‌లను తటస్థ వేదికలపైనే నిర్వహిస్తుండటం ఈ సారి కొత్తగా వచ్చిన మార్పు. సీజన్ ఆరంభానికి ముందు రంజీలో కూడా కొన్ని మ్యాచ్‌లను గులాబీ బంతితో ఫ్లడ్‌లైట్ల మధ్య నిర్వహించాలని భావించినా... అందు కోసం తాము సిద్ధం కాలేదని చాలా మంది క్రికెటర్లు తేల్చి చెప్పడంతో బోర్డు ఈ ఆలోచనను ఉపసంహరించుకుంది.
కొత్త సీజన్ కోసం పలువురు ఆటగాళ్లు తమ సొంత జట్లను వదిలి మరో జట్టు తరఫున ఆడాలని నిర్ణరుుంచుకున్నారు. తమిళనాడు ఆటగాడు బద్రీనాథ్ హైదరాబాద్ తరఫున బరిలోకి దిగుతుండగా, హైదరాబాద్ క్రికెటర్లు హనుమ విహారి, డీబీ రవితేజ ఆంధ్రకు తరలివెళ్లారు. ఆరేళ్ల పాటు బరోడా తరఫున ఆడిన తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు ఈ సారి విదర్భకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ముంబై మరోసారి డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతుండగా... హైదరాబాద్, ఆంధ్ర జట్లు గ్రూప్ ‘సి’లోనే ఉన్నారుు.
కొత్త రంజీ సీజన్ ప్రారంభం నేపథ్యంలో ఈ టోర్నీకి సంబంధించి కొన్ని ఆసక్తికర విశేషాలు...
►రంజీ చరిత్రలో ఒకే ఒక మ్యాచ్ టైగా ముగిసింది (దక్షిణ పంజాబ్, బరోడా మధ్య 1946).
►అత్యధిక వ్యక్తిగత స్కోరు 443 నాటౌట్ (బీబీ నింబాల్కర్-1948, మహారాష్ట్ర).
►సీకే నాయుడు 61 ఏళ్ల వయసులో (1956-57) తన ఆఖరి రంజీ మ్యాచ్ ఆడారు.
►బాంబే/ముంబై జట్టు అత్యధికంగా 41 సార్లు రంజీ ట్రోఫీ గెలిచింది. 1958నుంచి 1972 మధ్య వరుసగా 15 సార్లు టైటిల్ సాధించడం విశేషం. రెండో స్థానంలో కర్ణాటక (8) ఉంది.
►ఢిల్లీ, కర్ణాటక మధ్య 1981-82 రంజీ ఫైనల్ ఆరు రోజుల పాటు సాగింది.
►రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టిన ఏకై క బ్యాట్స్‌మన్ రవిశాస్త్రి.
►ఒకే ఇన్నింగ్‌సలో రెండు ట్రిపుల్ సెంచరీలు ఒకే ఒక సారి నమోదయ్యారుు (డబ్ల్యూవీ రామన్, అర్జన్ కృపాల్ సింగ్-తమిళనాడు, 1988లో).
►రంజీల్లో అత్యధిక స్కోరు (944/6- ఆంధ్రపై), అత్యల్ప స్కోరు (21-రాజస్థాన్‌పై) రెండూ హైదరాబాద్ పేరిటే ఉన్నారుు.
► 1999లో జమ్మూ కశ్మీర్‌తో జరిగిన మ్యాచ్‌లో హిమాచల్ ఆటగాడు రాజీవ్ నయ్యర్ అత్యధిక నిమిషాలు (1015) బ్యాటింగ్ చేసి ప్రపంచరికార్డు సృష్టించాడు.
► ఒక సీజన్‌లో అత్యధిక పరుగులు (1415), సెంచరీల (8) రికార్డు వీవీఎస్ లక్ష్మణ్‌దే.
►అమోల్ మజుందార్ (136) ఎక్కువ రంజీ మ్యాచ్‌లు ఆడాడు.
►రంజీ కెరీర్‌లో ఆడిన తొలి మూడు ఇన్నింగ్‌సలలో కూడా హ్యాట్రిక్ తీసిన ఘనత జేఎస్ రావు (సర్వీసెస్) సొంతం.
►ఇన్నింగ్‌సలో 10 వికెట్లు తీసిన ఇద్దరు ఆటగాళ్లు ప్రేమాంశు ఛటర్జీ (బెంగాల్), ప్రదీప్ సుందరమ్ (రాజస్థాన్).
►మ్యాచ్‌లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన అనిల్ కుంబ్లే (16/99).
►1944-45 రంజీ ఫైనల్లో హోల్కర్ బౌలర్ సీఎస్ నాయుడు ఏకంగా 917 బంతులు (152.5 ఓవర్లు) బౌలింగ్ చేశాడు.
►టోర్నీలో అత్యధిక వికెట్లు రాజీందర్ గోయల్ (637).
► టోర్నీలో అత్యధిక పరుగులు వసీం జాఫర్ (10,143).