ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ నియమితులయ్యారు.
తిరుపతి :ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ నియమితులయ్యారు. శనివారం రాత్రి తిరుపతిలోని ఓ ప్రైై వేటు హోటల్‌లో రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశం జరిగింది. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడుగా గల్లా జయదేవ్‌ను ఈ సందర్భంగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
తదుపరి కార్యవర్గాన్ని త్వరలోనే హైదరాబాద్‌లో ప్రకటి స్తామని తెలిపారు. ఈ సందర్భంగా గల్లా జయదేవ్ మాట్లాడుతూ... రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి కృషి చేస్తాన్నారు.