పాక్‌పై కఠినంగా వ్యవహరించాలి
తిరువళ్లూరు, న్యూస్‌లైన్: సరిహద్దులో కాల్పుల విరమణ ఉన్నప్పటికీ భారత సైనికులను కాల్చి చంపిన పాకిస్థాన్‌పై కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని క్రికెటర్ గౌతమ్ గంభీర్ కోరాడు. ఇలాంటి చర్యలతో ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశాడు. అలాగే క్రికెట్‌లో ఫిక్సింగ్ ఉదంతాలతో ఆటకు చెడ్డ పేరు వస్తున్న మాట వాస్తవమేనని అంగీకరించాడు. అయితే ఇది ఆటను నాశనం చేయలేదని స్పష్టం చేశాడు.
వన్డే ఫార్మాట్ కన్నా టెస్టులు ఆటగాడిలోని పూర్తి నైపుణ్యాన్ని వెలికితీస్తాయని అభిప్రాయపడ్డాడు. 2007లో తనను జట్టులో నుంచి తప్పించినా కఠోర సాధనతోనే తిరిగి చోటు దక్కించుకున్నానని గుర్తు చే శాడు. కెరీర్‌లో సచిన్‌తో ఆడడాన్ని గుర్తుంచుకుంటానని, అతడి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని కొనియాడాడు. స్వాతంత్య్ర సమర యోధుడు భగత్ సింగ్‌ను అమితంగా ఇష్టపడతానని తమిళనాడులోని తిరువళ్లూరులో ఓ కార్యక్రమానికి హాజరైన గంభీర్ చెప్పాడు.