మంచి అబ్బాయిలే ముందుంటారు: గంభీర్ | Gautam Gambhir takes a dig at Virat Kohli after RCB lose IPL final | Sakshi
Sakshi News home page

మంచి అబ్బాయిలే ముందుంటారు: గంభీర్

Published Tue, May 31 2016 12:19 AM | Last Updated on Mon, Sep 4 2017 1:16 AM

మంచి అబ్బాయిలే ముందుంటారు: గంభీర్

మంచి అబ్బాయిలే ముందుంటారు: గంభీర్

న్యూఢిల్లీ: ఐపీఎల్ విజేతగా నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును అభినందించే క్రమంలో గౌతం గంభీర్ ట్విట్టర్‌లో చేసిన వ్యాఖ్య చర్చను రేపింది. సన్ జట్టుకు అభినందనలు తెలుపుతూనే బెంగళూరు ఆటగాళ్లు మంచివాళ్లు కాదనే భావం ఇందులో కనిపించింది. ‘ఐపీఎల్ గెలిచిన సన్‌రైజర్స్‌కు అభినందనలు. మంచి అబ్బాయిలే మొదటి స్థానంలో ముగిస్తారు.

ఏ ఫార్మాట్‌లోనైనా బౌలర్లే గెలిపిస్తారు’ అని వ్యాఖ్యానించాడు. దీనిపై కోహ్లి అభిమానుల నుంచి తీవ్ర స్థాయిలో ప్రతిస్పందన ఎదురైంది. వారు మంచివాళ్లంటే మిగతా వారు కాదనా దీని అర్థం అంటూ వారు విరుచుకుపడ్డారు. మరోవైపు పాక్ ఆటగాడు ఉమర్ అక్మల్ అత్యుత్సాహంతో    ‘పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో విజేతగా నిలిచిన వార్నర్ కు అభినందనలు’ అంటూ తన అజ్ఞానాన్ని ప్రదర్శించి అభాసుపాలయ్యాడు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement