
సాక్షి, హైదరాబాద్: వర్ధమాన యువ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గాయత్రి పుల్లెల తన ఖాతాలో మరో టైటిల్‌ను జమ చేసుకుంది. చండీగఢ్‌లో ఆదివారం ముగిసిన కృష్ణ ఖైతాన్ ఆలిండియా జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో గాయత్రి అండర్–19 బాలికల సింగిల్స్‌లో విజేతగా నిలిచింది. ఫైనల్లో 14 ఏళ్ల గాయత్రి 23–21, 21–18తో టాప్ సీడ్ పూర్వా బర్వే (మహారాష్ట్ర)పై నెగ్గింది. అండర్–19 బాలుర డబుల్స్ ఫైనల్లో తెలంగాణకు చెందిన పి. విష్ణువర్ధన్ –శ్రీకృష్ణ జోడీ 18–21, 21–15, 21–13తో సంజయ్ శ్రీవత్స (పాండిచ్చేరి)–సిద్ధార్థ్ (తెలంగాణ) జంటపై నెగ్గి స్వర్ణం సాధించింది.
అండర్–19 మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్లో శ్రీకృష్ణ –సృష్టి జూపూడి (తెలంగాణ) ద్వయం 21–19, 21–15తో ఎడ్విన్ –నఫీసా (కేరళ) జంటపై గెలిచింది. అండర్–17 బాలుర డబుల్స్ ఫైనల్లో బొక్కా నవనీత్–విష్ణువర్ధన్ (తెలంగాణ) జంట 20–22, 17–21తో ఎడ్విన్ జాయ్–అరవింద్ (కేరళ) జోడీ చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment