న్యూఢిల్లీ: మియామి ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) ద్వయం శుభారంభం చేసింది. తొలి రౌండ్‌లో ఈ టాప్ సీడ్ జంట 6-1, 6-0తో ఎలీనా బొగ్డాన్ (రుమేనియా)-నికోల్ మెలిచార్ (అమెరికా) జోడీపై అలవోకగా గెలిచింది. 45 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సానియా ద్వయం తమ ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరు సార్లు బ్రేక్ చేసి తమ సర్వీస్‌ను ఒకసారి కోల్పోయింది.
పేస్ జోడీ ఓటమి: మరోవైపు ఇదే టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో లియాండర్ పేస్ (భారత్)- క్లాసెన్ (దక్షిణాఫ్రికా); బోపన్న (భారత్)- నెస్టర్ (కెనడా) జంటలకు తొలి రౌండ్‌లోనే ఓటమి ఎదురైంది. మొదటి రౌండ్‌లో పేస్-క్లాసెన్ 4-6, 2-6తో ఫాగ్‌నిని-బొలెలీ (ఇటలీ)ల చేతిలో; బోపన్న-నెస్టర్ 3-6, 6-7 (4/7)తో ఇస్నెర్- క్వెరీ (అమెరికా)ల చేతిలో ఓడిపోయారు.
సానియా జంట శుభారంభం
Published Mon, Mar 30 2015 2:37 AM | Last Updated on Sat, Sep 2 2017 11:33 PM
Advertisement
Advertisement