బ్రిటన్ ‘రికార్డు’
మహిళల టీమ్ పర్సూట్‌లో బ్రిటన్ జట్టు ప్రపంచ రికార్డుతో స్వర్ణం గెలుచుకుంది. 48 గంటల క్రితం సెమీస్‌లో తామే నెలకొల్పిన రికార్డును సైక్లిస్ట్‌లు బద్దలు కొట్టారు. కేటీ ఆర్చిబాల్డ్, లారా ట్రాట్, ఎలినోర్ బార్కర్, జోవానా రౌసెల్‌లు 4 కిలోమీటర్ల రేసులో 4.10.236 నిమిషాల రికార్డు టైమింగ్‌తో బంగారు పతకం గెలిచారు. ఫైనల్ రేసు ఆరంభంలో అమెరికా జట్టు ముందంజలో ఉన్నప్పటికీ.. వెంటనే బ్రిటన్ సైక్లిస్టులు పుంజుకున్నారు.