
పాక్ బౌలర్ ఉస్మాన్ ఖాన్
దుబాయ్: ఆసియాకప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పసికూన హాంకాంగ్ 116 పరుగులకే కుప్పకూలింది. పాక్ బౌలర్ల దాటికి హాంకాంగ్ బ్యాట్స్‌మన్ పెవిలియన్‌కు క్యూ కట్టారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హాంకాంగ్ జట్టులో కేడీ షా (26), అయిజాజ్ ఖాన్(27)లదే టాప్ స్కోర్ కావడం విశేషం. పాక్ బౌలర్లలో ఉస్మాన్ ఖాన్ మూడు, హసన్ అలీ, షాదాబ్ ఖాన్‌లు రెండేసి వికెట్లు తీయగా.. అష్రాఫ్ ఒక వికెట్ పడగొట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment