
పెళ్లిలో సారీ చెప్పిన హర్భజన్
జలంధర్: భారత క్రికెటర్ హర్భజన్ సింగ్ పెళ్లిలో బౌన్సర్లుగా అతిగా స్పందించి మీడియా ప్రతినిధులపై దాడి చేశారు. విషయం తెలుసుకున్న హర్భజన్ మీడియా ప్రతినిధులకు క్షమాపణలు చెప్పాడు.
గురువారం జలంధర్లో హర్భజన్.. తన ప్రియురాలు గీతా బస్రాను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ పెళ్లికి సచిన్ దంపతులతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వివాహ వేదిక పొరుగింటిపై నుంచి మీడియా ప్రతినిధులు హర్భజన్ పెళ్లిని వీడియో తీసేందుకు ప్రయత్నించారు. అయితే బౌన్సర్లు వెళ్లి కెమెరామెన్లపై దాడికి దిగారు. భజ్జీ పెళ్లి వైభవంగా జరిగినా.. చివర్లో మీడియా ప్రతినిధులపై బౌన్సర్లు దాడి చేయడంతో వివాదం ఏర్పడింది.