హరికృష్ణకు కెరీర్ బెస్ట్ ర్యాంక్
టాప్-10లో తొలిసారి ప్రవేశం
చెన్నై: ఆంధ్రప్రదేశ్ చెస్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ తన కెరీర్‌లో ఉత్తమ ర్యాంక్‌ను సాధించాడు. ప్రపంచ చెస్ సమాఖ్య (ఫిడే) విడుదల చేసిన తాజా ర్యాంకింగ్‌సలో 30 ఏళ్ల హరికృష్ణ రెండు స్థానాలు పురోగతి సాధించి పదో ర్యాంక్‌కు ఎగబాకాడు. హరికృష్ణ ఖాతాలో 2768 రేటింగ్ పారుుంట్లు ఉన్నారుు. గుంటూరు జిల్లాకు చెందిన హరికృష్ణ 2001లో గ్రాండ్‌మాస్టర్ (జీఎం) హోదా పొందాడు.
ఇప్పటివరకు కెరీర్‌లో హరికృష్ణ 364 గేముల్లో గెలిచి, 446 గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని, 135 గేముల్లో ఓడిపోయాడు. మరోవైపు విశ్వనాథన్ ఆనంద్ 2779 పారుుంట్లతో ఏడో ర్యాంక్‌లో నిలిచి భారత నంబర్‌వన్ ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు. ఓవరాల్‌గా టాప్-100లో భారత్ నుంచి ఏడుగురు ఆటగాళ్లు చోటు సంపాదించారు. భారత్‌కే చెందిన విదిత్ సంతోష్ గుజరాతి 53వ, పరిమార్జన్ నేగి 76వ, అధిబన్ 82వ, సూర్యశేఖర గంగూలీ 86వ, కృష్ణన్ శశికిరణ్ 100వ ర్యాంక్‌లో ఉన్నారు.