ఫైనల్లో హరియాణా హ్యామర్స్ | Haryana Hammers pip Punjab Royals in a nail-biting Pro wrestling League semi-final | Sakshi
Sakshi News home page

ఫైనల్లో హరియాణా హ్యామర్స్

Published Sun, Dec 27 2015 1:12 AM | Last Updated on Sun, Sep 3 2017 2:37 PM

ఫైనల్లో హరియాణా హ్యామర్స్

ఫైనల్లో హరియాణా హ్యామర్స్

సెమీస్‌లో పంజాబ్‌పై 4-3తో గెలుపు
ప్రొ రెజ్లింగ్ తుదిపోరులో నేడు ముంబైతో ఢీ
 న్యూఢిల్లీ:
నిర్ణయాత్మక బౌట్‌లో రెజ్లర్ లివాన్ లోపెజ్ అజుకి సంచలన ప్రదర్శనతో.... ప్రొ రెజ్లింగ్ లీగ్ (పీడబ్ల్యుఎల్)లో హరియాణా హ్యామర్స్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో హరియాణా 4-3తో పంజాబ్ రాయల్స్‌ను ఓడించింది. ఆరంభంలో ‘పట్టు’ చూపించడంలో వెనుకబడిన హరియాణా తర్వాతి బౌట్లలో మాత్రం చెలరేగింది. కీలకమైన ఆఖరి బౌట్‌లో లోపెజ్ (హరియాణా) 5-1తో ప్రవీణ్ రాణా (పంజాబ్)పై గెలిచి జట్టుకు తిరుగులేని విజయాన్ని అందించాడు. బౌట్ ఆరంభంలోనే ప్రవీణ్ గాయపడటంతో అతని గెలుపు అవకాశాలను దెబ్బతీసింది.
 
 అంతకుముందు తొలి రెండు బౌట్లలో రజనీష్ (65 కేజీ) 12-2తో విశాల్ రాణాపై; వాసిలిసా మర్జాలిక్ (69 కేజీ) 4-0తో గీతికా జక్కర్‌పై గెలవడంతో పంజాబ్ 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది. తర్వాత హరియాణా రెజ్లర్లు అండ్రెట్సి వాలెరి (97 కేజీ) 5-4తో మౌసమ్ ఖత్రిపై; తతన్య కిట్ (53 కేజీ) ప్రియాంక ఫోగట్‌పై గెలిచి స్కోరును 2-2తో సమం చేశారు. ఇక 125 కేజీల బౌట్‌లో చులున్‌బత్ (పంజాబ్) 5-1తో హితేందర్ (హరియాణా)పై గెలిస్తే... ఒక్సానా హర్‌హెల్ (హరియాణా) 4-0తో గీత ఫోగట్‌పై నెగ్గింది. దీంతో స్కోరు 3-3తో సమమైంది. గాయంతో హరియాణా స్టార్ రెజ్లర్ యోగేశ్వర్ దత్ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఆదివారం జరిగే టైటిల్ పోరులో హరియాణా... పటిష్టమైన ముంబైతో తలపడుతుంది.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement