అబుదాబి: పాకిస్థాన్‌తో జరిగిన తొలి టెస్టులో శ్రీలంక 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో చివరికి లంక బౌలర్లే పైచేయి సాధించారు. శ్రీలంక నిర్ధేశించిన 136 పరుగుల స్పల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ బ్యాట్స్‌మెన్ రంగనా హెరాత్(6-43) దాటికి చిత్తయ్యారు. హరీస్ సోహైల్(34), అసద్ షఫిక్(20), సర్ఫరాజ్ అహ్మద్(19)లు మినహా మిగతా బ్యాట్స్‌మెన్స్ ఎవరూ రెండెంకల స్కోరు చేయలేదు. దీంతో పాక్ 114 పరుగులకే కుప్పకూలింది.హెరాత్‌కు 6 వికెట్లు, పెరీరాకు 3, లక్మాల్ ఒక వికెట్ దక్కింది. ఈ మ్యాచ్‌లో రంగనా హెరాత్ 400 వికెట్లు సాధించిన తొలి లెఫ్టార్మ్ బౌలర్‌గా గుర్తింపు పొందాడు.
అంతకుముందు 69/4 ఓవర్ నైట్ స్కోరుతో చివరిరోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన లంకేయులు.. యాసిర్ షా దెబ్బకు విలవిల్లాడారు. స్వల్ప విరామాల్లో వికెట్లు కోల్పోతూ యాసిర్ కు దాసోహమయ్యారు. లంక ఆటగాళ్లలో నిరోషాన్ డిక్ వెల్లా(40 నాటౌట్;76 బంతుల్లో 4 ఫోర్లు) మినహా ఎవరూ రాణించలేదు. ఫలితంగా శ్రీలంక రెండో ఇన్నింగ్స్ లో 138 పరుగులకే చాపచుట్టేసింది.
శ్రీలంక తొలి ఇన్నింగ్స్ 419 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 138 ఆలౌట్
పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్ 422 ఆలౌట్