బ్యాడ్ బోయ్ హెర్ష్లీ గిబ్స్ అరెస్టు | herschelle gibbs arrested for drunken driving | Sakshi
Sakshi News home page

బ్యాడ్ బోయ్ హెర్ష్లీ గిబ్స్ అరెస్టు

Published Wed, Dec 3 2014 3:05 PM | Last Updated on Fri, May 25 2018 2:06 PM

బ్యాడ్ బోయ్ హెర్ష్లీ గిబ్స్ అరెస్టు - Sakshi

బ్యాడ్ బోయ్ హెర్ష్లీ గిబ్స్ అరెస్టు

దక్షిణాఫ్రికా మాజీ బ్యాట్స్మన్ హెర్ష్లీ గిబ్స్కు ఎప్పటినుంచో బ్యాడ్బోయ్ అని పేరుంది. ఎప్పుడూ వివాదాలతోనే కాపురం చేసే గిబ్స్.. తాజాగా మరోసారి అరెస్టయ్యాడు. తాగి వాహనం నడిపిన కేసులో అతగాడికి పోలీసులు అరదండాలు తగిలించి అత్తారింటికి పంపారు. ఫుల్లుగా తాగేసి ఉన్న గిబ్స్.. విపరీతమైన వేగంతో కారు నడిపి మరో కారును ఢీకొన్నాడు. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. అయితే తాగి వాహనం నడిపినందుకు గిబ్స్ మీద కేసు నమోదు చేసి అతడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

గిబ్స్ తాగి వాహనం నడపడం ఇది మొదటిసారేమీ కాదు. ఇంతకుముందు 2008 మార్చిలో కూడా కేప్టౌన్ నగరంలోనే బాగా పూటుగా తాగి నిర్లక్ష్యంగా వాహనం నడిపినందుకు అతడిని పోలీసులు అరెస్టు చేశారు. 2009లో డ్రగ్స్, మద్యం అలవాట్ల నుంచి బయటపడేందుకు రీహాబిలిటేషన్ కోర్సులో చేరాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement