హోలీ ఫ్యామిలీ స్కూల్ శుభారంభం | Holy Family School started | Sakshi
Sakshi News home page

హోలీ ఫ్యామిలీ స్కూల్ శుభారంభం

Published Thu, Aug 8 2013 12:48 AM | Last Updated on Fri, Sep 1 2017 9:42 PM

హోలీ ఫ్యామిలీ స్కూల్ శుభారంభం

హోలీ ఫ్యామిలీ స్కూల్ శుభారంభం

ఎల్బీస్టేడియం, న్యూస్‌లైన్: డాక్టర్ ఇమాన్యుయెల్ స్మారక ఇంటర్ స్కూల్ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్‌లో బాలికల విభాగంలో హోలీ ఫ్యామిలీ హైస్కూల్, ఇండస్ వరల్డ్ స్కూల్ జట్లు శుభారంభం చేశాయి. బోయిన్‌పల్లిలోని సెయింట్ ఆండ్రూస్ హైస్కూల్‌లో బుధవారం జరిగిన లీగ్ పోటీల్లో హోలీ ఫ్యామిలీ హైస్కూల్ జట్టు 10-2తో సెయింట్ మైకేల్ స్కూల్ టీమ్‌పై గెలిచింది. తొలి అర్ధభాగం ముగిసే సమయానికి 8-0 ఆధిక్యాన్ని సాధించిన హోలీ ఫ్యామిలీ హైస్కూల్ జట్టు ఆ తర్వాత కూడా దూకుడును కొనసాగించింది. వైష్ణవి ఆరు పాయింట్లు సాధించింది.
 
 సెయింట్ మైకేల్ స్కూల్ జట్టులో చందన 2 పాయింట్లు చేసింది. మరో మ్యాచ్‌లో ఇండస్ వరల్డ్ స్కూల్ జట్టు 7-4తో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ జట్టుపై గెలిచింది.  బాలుర విభాగంలో సెయింట్ ఆండ్రూస్ స్కూల్ జట్టు 24-16 పాయింట్ల్లతో గీతాంజలి స్కూల్ జట్టుపై గెలిచింది. మరో లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ జట్టు 28-3తో నాసర్ స్కూల్ జట్టుపై నెగ్గింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement