సాక్షి, హైదరాబాద్: ఇంటర్ జోనల్ మహిళల అండర్–23 క్రికెట్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ జట్టుకు పరాజయం ఎదురైంది. తమిళనాడు జట్టుతో కొచ్చిలో జరిగిన ఈ మ్యాచ్‌లో 39 పరుగుల తేడాతో హైదరాబాద్ ఓడింది. తొలుత తమిళనాడు జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 232 పరుగులు చేసింది.
కెప్టెన్ డి. హేమలత (152; 19 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీతో చెలరేగింది. హైదరాబాద్ బౌలర్లలో రచన 3, జి. త్రిష 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం 233 పరుగుల లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టు 49.2 ఓవర్లలో 193 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది. హిమాని (51) అర్ధసెంచరీతో ఆకట్టుకుంది.