సాక్షి, హైదరాబాద్: సబ్ జూనియర్ అంతర్ జిల్లా త్రోబాల్ చాంపియన్‌షిప్‌లో తొలిరోజు హైదరాబాద్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. తెలంగాణ త్రోబాల్ సంఘం ఆధ్వర్యంలో జరుగుతోన్న ఈ టోర్నీలో శనివారం జరిగిన మ్యాచ్‌ల్లో హైదరాబాద్ బాలుర జట్టు గెలుపొందగా... బాలికల జట్టుకు పరాజయం ఎదురైంది. బాలుర విభాగంలో హైదరాబాద్ 15-6, 15-4తో మెదక్ జట్టుపై, ఆదిలాబాద్ 15-12, 15-8తో మహబూబ్‌నగర్ జట్టుపై, వరంగల్ 15-9, 15-6తో నల్లగొండ జట్టుపై, రంగారెడ్డి 15-1, 15-7తో ఖమ్మంపై విజయం సాధించాయి. బాలికల విభాగంలో హైదరాబాద్ జట్టు 12-15, 11-15తో నిజామాబాద్ చేతిలో ఓటమి పాలవగా... వరంగల్ 15-9, 15-6తో నల్లగొండపై, ఖమ్మం 15-8, 15-9తో ఆదిలాబాద్‌పై నెగ్గాయి.
అంతకుముందు జరిగిన టోర్నీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షురాలు టి. అనిత ముఖ్య అతిథిగా విచ్చేసి పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (డీపీఎస్) ప్రిన్సిపల్ పద్మ జ్యోతి, రాష్ట్ర త్రోబాల్ సంఘం కార్యదర్శి జగన్మోహన్, ప్రభుత్వ హైస్కూల్, బండ్లగూడ హెడ్‌మాస్టర్ శ్రీనివాసరావు, శాట్స్ అబ్జర్వర్ హరినాథ్ పాల్గొన్నారు.
హైదరాబాద్‌కు మిశ్రమ ఫలితాలు
Published Sun, Feb 5 2017 11:01 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement