హైదరాబాద్ జట్ల ముందంజ | hyderabad leads in sepak takraw | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ జట్ల ముందంజ

Published Sun, Dec 18 2016 11:45 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

hyderabad leads in sepak takraw

రాష్ట్ర స్థాయి సెపక్‌తక్రా టోర్నీ  

 
సాక్షి, హైదరాబాద్: సీనియర్ అంతర్ జిల్లా సెపక్‌తక్రా చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ జట్లు ముందంజ వేశాయి. చాదర్‌ఘాట్‌లోని విక్టరీ ప్లేగ్రౌండ్‌లో శనివారం ప్రారంభమైన ఈ టోర్నీ రెగూ ఈవెంట్‌లో హైదరాబాద్ పురుషుల జట్టు 21-12, 21-5తో నిజామాబాద్‌పై, 21-19, 21-9తో కరీంనగర్‌పై విజయం సాధించాయి. మహిళల విభాగంలో తొలి మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు 21-6, 21-9తో మహబూబ్‌నగర్‌పై, మరో మ్యాచ్‌లో 21-10, 21-6తో నల్గొండను ఓడించింది. ఈ టోర్నీని రాష్ట్ర ప్రాధికార సంస్థ (శాట్స్) చైర్మన్ ఎ. వెంకటేశ్వరరెడ్డి ప్రారంభించారు.

 ఇతర మ్యాచ్‌ల ఫలితాలు

 పురుషులు: మెదక్ 21-13, 21-14తో నల్గొండపై, ఆదిలాబాద్ 21-3, 21-8తో మహబూబ్‌నగర్‌పై, రంగారెడ్డి 21-14, 21-13తో కరీంనగర్‌పై, నల్గొండ 21-14, 21-11తో వరంగల్‌పై, ఖమ్మం 21-19, 21-14తో నిజామాబాద్‌పై, మెదక్ 21-11, 21-4తో మహబూబ్‌నగర్‌పై, ఆదిలాబాద్ 21-9, 21-7తో వరంగల్‌పై, రంగారెడ్డి 19-21, 21-17, 21-19తో ఖమ్మంపై గెలుపొందాయి.

 మహిళలు: మెదక్ 21-5, 21-9తో నిజామాబాద్‌పై, ఆదిలాబాద్ 21-5, 21-7తో వరంగల్‌పై, రంగారెడ్డి 21-6, 21-7తో కరీంనగర్‌పై, నల్గొండ 21-9, 21-7తో వరంగల్‌పై, నిజామాబాద్ 21-8, 21-6తో కరీంనగర్‌పై, రంగారెడ్డి 21-12, 21-5తో ఖమ్మంపై, ఖమ్మం 21-8, 21-9తో నిజామాబాద్‌పై, నల్గొండ 21-13, 21-8తో ఆదిలాబాద్‌పై నెగ్గాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement