సాక్షి, హైదరాబాద్: కూచ్ బెహర్ క్రికెట్ టోర్నమెంట్లో హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ ఘోరంగా విఫలమయ్యారు. సూరత్‌లో గుజరాత్ జట్టుతో సోమవారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ తొలిరోజు ఆటముగిసే సమయానికి 15 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 15 పరుగులు మాత్రమే చేసింది.
గుజరాత్ బౌలర్లలో ఎన్ఏ దేశాయ్ కేవలం ఒక పరుగు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టి హైదరాబాద్ వెన్నువిరిచాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు 74.4 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌటైంది. వీఏ సోలంకి (30), ఎస్ఎస్ సూర్యల్ (32) రాణించారు. హైదరాబాద్ బౌలర్లలో భగత్ వర్మ 2 వికెట్లు తీయగా... విద్యానంద్ రెడ్డి, జీవీ వినీత్ రెడ్డి చెరో 3 వికెట్లు దక్కించుకున్నారు.