రన్నరప్‌ హైదరాబాద్‌ జట్లు | Hyderabad teams as runner up in inter district kabaddi tourney | Sakshi
Sakshi News home page

రన్నరప్‌ హైదరాబాద్‌ జట్లు

Published Mon, Dec 11 2017 10:42 AM | Last Updated on Tue, Sep 4 2018 5:32 PM

Hyderabad teams as runner up in inter district kabaddi tourney - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అంతర్‌ జిల్లా సీనియర్‌ కబడ్డీ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్‌ జట్లకు నిరాశ ఎదురైంది. ఎల్బీ స్టేడియంలో జరిగిన ఈ టోర్నీలో హైదరాబాద్‌ జట్లు రెండో స్థానంతో సరిపెట్టుకున్నాయి. పురుషుల ఫైనల్లో నల్లగొండ జట్టు 30-29తో హైదరాబాద్‌ను ఓడించి చాంపియన్‌గా నిలిచింది.

మహిళల కేటగిరీలోనూ హైదరాబాద్‌ 25-36తో వరంగల్‌ చేతిలో పరాజయం పాలైంది. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు ఎన్‌. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కబడ్డీ సంఘం అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, కార్యదర్శి కె. జగదీశ్వర్‌ యాదవ్‌ పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement