
బస్సులోనూ అవే ఆలోచనలు
బెంగళూరు: తన మదిలో ఎప్పుడూ క్రికెట్‌కు సంబంధించిన ఆలోచనలే ఉంటాయని, బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు కూడా రాబోయే మ్యాచ్‌లో ఎలా ఆడాలన్న విషయంపై మానసికంగా సిద్ధమవుతుంటానని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) కెప్టెన్ విరాట్ కోహ్లి తెలిపాడు.
‘బస్సులో ప్రయాణిస్తున్నా క్రికెట్ గురించే ఆలోచిస్తుంటాను. తదుపరి మ్యాచ్‌లో ఎలా ఆడాలి, ఏ బౌలర్‌ను ఎలా ఎదుర్కోవాలనే విషయాలపై ప్రణాళికలు వేసుకుంటుంటాను’ అని అన్నాడు. దూకుడే తన బలమని, అయితే ప్రస్తుతం నియంత్రణతో కూడిన దూకుడు ఉందని తెలిపాడు. రికార్డుల గురించి ఆలోచించకుండా ఆరోజు ఎలా ఆడాలన్న దానిపైనే ఎప్పుడూ తన దృష్టంతా ఉంటుందన్నాడు.