కోల్‌కతా: ఒకప్పుడు తాను భారత క్రికెట్ జట్టుకు కోచ్‌గా మారాలని ఎంతో కోరుకున్నానని...అయితే విధి తనను పరిపాలనా వ్యవహారాల వైపు తీసుకెళ్లిందని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ వ్యాఖ్యానించాడు. ‘మనం ఏం చేయగలమో దాని గురించే ఆలోచించాలి. జీవితం మనల్ని ఎటువైపు తీసుకెళుతుందో ఎవరూ చెప్పలేరు. 1999లో నేను సచిన్ నాయకత్వంలో ఆస్ట్రేలియాకు వెళ్లినప్పుడు కనీసం వైస్ కెప్టెన్‌ను కూడా కాదు. కానీ మూడు నెలలకే నేను భారత కెప్టెన్ అయ్యాను. ఆటనుంచి తప్పుకున్నాక భారత జట్టు కోచ్ కావాలని గట్టిగా అనుకున్నాను.
అయితే దాల్మియా మరణంతో నాకు క్యాబ్ అధ్యక్ష పదవి లభించింది. కొంత మంది ఈ స్థాయికి చేరేందుకు కనీసం 20 ఏళ్లు పడుతుంది’ అని సౌరవ్ నాటి రోజులు గుర్తు చేసుకున్నాడు. 1995–2006 మధ్య కాలంలో తన కెరీర్ అద్భుతంగా సాగిందని, ప్రపంచం తన పాదాల కింద ఉన్నట్లు అనిపించిందన్న దాదా...చాపెల్ రాకతో ఆ తర్వాత అంతా మారిపోయిందన్నాడు. వ్యక్తిగతంగా తాను కూడా నెమ్మదైన స్వభావం ఉన్నవాడినే అయినా కెప్టెనయ్యాక జట్టు కోసం కఠినంగా మారాల్సి వచ్చిందని సౌరవ్ చెప్పాడు.
Comments
Please login to add a commentAdd a comment