ఆ నిబంధన మార్చాలి: ధోని | I would like current playing conditions to change, says Dhoni | Sakshi
Sakshi News home page

ఆ నిబంధన మార్చాలి: ధోని

Published Fri, Mar 27 2015 12:14 PM | Last Updated on Sat, Sep 2 2017 11:28 PM

ఆ నిబంధన మార్చాలి: ధోని

ఆ నిబంధన మార్చాలి: ధోని

మెల్ బోర్న్: వన్డేల్లో బ్యాట్స్ మెన్ కు అనుకూలంగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) ప్రవేశపెట్టిన 'నలుగురు ఫీల్డర్ల' నిబంధన మార్చాలని టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అభిప్రాయపడ్డాడు. ' ఈ నిబంధన మార్చాలన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. క్రికెట్ చరిత్రలో అంతకుముందెన్నడూ వన్డేల్లో డబుల్ సెంచరీలు మనం చూడలేదు. ఈ మూడేళ్లలోనే మూడు ద్విశతకాలు (వాస్తవానికి ఆరు డబుల్ సెంచరీలు) నమోదమయ్యాయి' అని ధోని పేర్కొన్నాడు.

30- యార్డ్ సర్కిల్ బయట నలుగురు ఫీల్డర్ల కంటే ఎక్కువ మంది ఉండరాదని ఐసీసీ నిబంధన తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ నిబంధనతో డాట్ బాల్స్ వేయాలని అందరూ కోరుతున్నారని ధోని వాపోయాడు. 11 మందిని సర్కిల్ లోపలేవుంచితే మరిన్ని డాట్ బాల్స్ పడతాయంటూ వ్యంగ్యంగా అన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement