ఐబీఎల్-2 వాయిదా! | IBL to be postponed due to busy international calendar | Sakshi
Sakshi News home page

ఐబీఎల్-2 వాయిదా!

Published Tue, Apr 22 2014 1:00 AM | Last Updated on Sat, Sep 2 2017 6:20 AM

IBL to be postponed due to busy international calendar

జనవరికి మార్చే అవకాశం
 
 న్యూఢిల్లీ: ప్రారంభమైన తొలి ఏడాదే సూపర్ సక్సెస్ సాధించినా.. ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్) రెండో సీజన్‌ను ఈ ఏడాది నిర్వహించే అవకాశాలు దాదాపు లేనట్లుగానే కనిపిస్తోంది. గత ఏడాది ఆగస్టులో ఆరంభ టోర్నీ నిర్వహించిన భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) ఐబీఎల్-2ను ఈ ఏడాది సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 15 వరకు నిర్వహించాలని భావించింది. కానీ, పలు అంతర్జాతీయ టోర్నీల కారణంగా దీన్ని వాయిదా వేసే సూచనలు కనిపిస్తున్నాయి.


 
  జూలైలో కామన్వెల్త్ క్రీడలు, సెప్టెంబర్‌లో ఆసియా క్రీడలు జరగనున్న నేపథ్యంలో పలువురు అగ్రశ్రేణి క్రీడాకారులు ఐబీఎల్‌కు అందుబాటులో ఉండకపోవచ్చని, దీంతో టోర్నీకి గ్లామర్ తగ్గుతుందని భావిస్తున్నారు. అయితే ఈ విషయమై ఇంకా ఏ నిర్ణయం తీసుకోకపోయినా.. వచ్చే ఏడాది ఆరంభంలో నిర్వహించే ఆలోచన చేస్తున్నట్లు బాయ్ ఉపాధ్యక్షుడు టీపీఎస్ పురి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement